ప్రభుత్వ అధికారులపై.. నటుడు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు

Mohan babu sensational comments on IAS and IPS officers. తన మనసులో ఉన్న మాటను ఎలాంటి భయం లేకుండా చెప్పే టాలీవుడ్‌ సినీయర్‌ నటుడు

By అంజి
Published on : 20 Dec 2022 6:25 AM

ప్రభుత్వ అధికారులపై.. నటుడు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు

తన మనసులో ఉన్న మాటను ఎలాంటి భయం లేకుండా చెప్పే టాలీవుడ్‌ సినీయర్‌ నటుడు మంచు మోహన్‌బాబు మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, వారికే తొత్తులుగా పని చేస్తారని అన్నారు. తిరుపతిలో తమిళ్‌ హీరో విశాల్‌ 'లాఠీ' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న మోహన్‌ బాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు డిపార్ట్‌మెంట్‌ అంటే గౌరవం ఉందన్న ఆయన.. తాను నిజాన్ని నిర్భయంగా చెబుతానని అన్నారు.

''ప్రభుత్వ అధికారుల్లో ఎక్కువ శాతం మంది ఏ ప్రభుత్వం వస్తే.. ఆ ప్రభుత్వానికి పని చేస్తున్నారు. సార్ ఇది నిజం, ఇది జరిగింది, నేను కళ్లా చూశాను, మీరు తప్పు చెప్పమంటున్నారు, నేను నిజం చూశాను అని చెబితే అతడి ఉద్యోగం ఊడుతుంది. ఇది నేను చాలా ఓపెన్‌గా చెబుతున్నా'' అని అన్నారు. పై స్థాయి అధికారుల్లో ఎక్కువ శాతం ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటారని చెప్పారు. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కాగా మోహన్‌ బాబు గతంలో కూడా చాలా సందర్భాల్లో సంచలన కామెంట్స్‌ చేశారు.

Next Story