AP: ఓటరును చెంప దెబ్బ కొట్టడంపై స్పందించిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌: పోలింగ్‌ స్టేషన్‌లో ఓటరును చెంపదెబ్బ కొట్టడంపై తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివ కుమార్‌ వివరణ ఇచ్చారు.

By అంజి  Published on  13 May 2024 3:15 PM IST
MLA Shiva Kumar, voter, Tenali, APPolls

AP: ఓటరును చెంప దెబ్బ కొట్టడంపై స్పందించిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌: పోలింగ్‌ స్టేషన్‌లో ఓటరును చెంపదెబ్బ కొట్టడంపై తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివ కుమార్‌ వివరణ ఇచ్చారు. ''నేను, నా భార్య ఓటేసేందుకు వెళ్లాం. గొట్టిముక్కల సుధాకర్‌ అనే వ్యక్తి నా గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఎస్సీలు, మైనార్టీలకు అంటకాగావేడు వచ్చాడు అని దూషించాడు. అతడు తాగొచ్చి గొడవ చేస్తున్నాడని అక్కడ ఉన్న ఓటర్లు కూడా చెప్పారు. అందుకే కోపంతో కొట్టాను'' అని ఎమ్మెల్యే వివరించారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలి పట్టణంలోని పోలింగ్ బూత్ వద్ద ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, జనసేన అభ్యర్థి మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు పోలింగ్ బూత్ లోకి వెళుతుండగా కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో రెండువర్గాల వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దానికి ప్రతిగా ఆ వ్యక్తి కూడా ఎమ్మెల్యే మీద చేయి చేసుకోవడం ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన అనుచరులు తనపై దాడి చేసి, గాయ పరిచారు అంటూ ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా టీడీపీ కార్యకర్తలు మహిళా ఓటర్లను వేధిస్తున్నారన్న సమాచారం రావడంతో అడ్డుకోవడానికి ఎమ్మెల్యే వెళ్లారని, అక్కడ టీడీపీ కార్యకర్తలు శివకుమార్‌ను దూషించడం ఘర్షణకు దారితీసిందంటూ వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Next Story