కోట్లు ఇస్తామన్నారు.. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

MLA Rapaka Varaprasad Sensational comments. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో టీడీపీ తనతో బేరసారాలు జరిపిందని

By Medi Samrat  Published on  26 March 2023 1:00 PM GMT
కోట్లు ఇస్తామన్నారు.. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

MLA Rapaka Varaprasad


ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో టీడీపీ తనతో బేరసారాలు జరిపిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు అమ్ముకుంటే పదికోట్లు వచ్చి ఉండేవని రాపాక తెలిపారు. ఈ ఆఫర్ ను వైసీపీ పైన ఉన్న గౌరవం, నమ్మకంతో వదిలేశానని అన్నారు. రాజోలులో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాపాక స్నేహితుడు కేఎస్ఎన్ రాజుతో టీడీపీ లీడర్లు బేరాలు జరిపారని, అసెంబ్లీ దగ్గర కూడా ఓ రాజుగారు టీడీపీకి ఓటేస్తే తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తూ తనకు డబ్బులిచ్చే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకొని తిరగలేము.. సిగ్గు శరం వదిలేసి ఉంటే పదికోట్లు వచ్చి ఉండేవని అన్నారు. తను పార్టీకి ఎప్పుడు వెన్ను పోటు పొడవనని నిజాయితీగా పనిచేస్తానని రాపాక చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చోటుచేసుకోవడంతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం వైసీపీ తన ఎమ్మెల్యేలైన ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని సస్పెండ్ చేసింది. క్రాస్ ఓటింగ్ చేసిన వ్యక్తులు డబ్బులకు అమ్ముడుపోయారని వైసీపీ ఆరోపిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.10 కోట్ల నుంచి 15 కోట్లు ఆఫర్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.


Next Story