ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష

MLA Nandamuri Balakrishna Mouna Deeksha in Hindupur.హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్​తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2022 12:17 PM IST
ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష

హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్​తో హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మౌన దీక్ష చేప‌ట్టారు. తొలుత త‌న నివాసం నుంచి ప‌ట్ట‌ణంలోని పొట్టి శ్రీరాములు విగ్ర‌హం వ‌ద్ద‌కు చేరుకున్న బాల‌కృష్ణ‌.. అక్క‌డి నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తు టీడీపీ శ్రేణులు, యువ‌త పాల్గొన్నారు. ఈ ర్యాలీ పొడ‌వునా.. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాల‌నే నినాదాలు మారుమోగాయి.

అంబేడ్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద ఎమ్మెల్యే బాల‌కృష్ణ మౌన‌దీక్ష చేప‌ట్టారు. ప్ర‌భుత్వం కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న శ్రీస‌త్య‌సాయి జిల్లాకు పుట్ట‌ప‌ర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రోవైపు సాయంత్రం అఖిల‌ప‌క్ష నేత‌ల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో బాల‌య్య పాల్గొన‌నున్నారు. ఈ స‌మావేశంలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాల‌నే డిమాండ్‌తో చేప‌ట్టాల్సిన ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించ‌నున్నారు.

Next Story