వరదలో చిక్కుకున్న కారు.. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి
MLA Kotamreddy brought vehicles stuck water shore. ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు తెలియని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.
By అంజి Published on 4 Aug 2022 4:39 PM ISTఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు తెలియని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే.. ఆయన అధికారం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ప్రజా సమస్యలపై తన గొంతు వినిపిస్తూనే ఉంటారు. కోటంరెడ్డి సాధారణ వ్యక్తిలా ఉంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా నిరూపించుకున్నారు. వర్షంలో తడుస్తూనే తన వంతు సహాయం చేసి అందరి మన్ననలు పొందారు.
నెల్లూరులో ఇవాళ ఉదయం భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. ఈ క్రమంలోనే నిత్యం రద్దీగా ఉండే మాగుంట లేఅవుట్ అండ్ బ్రిడ్జిలోకి మోకాళ్ల లోతు నీరు చేరింది. అదే సమయంలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా అటువైపుగా వెళ్తుండగా.. రోడ్లపైకి భారీగా చేరిన వరద నీరును చూసి అక్కడే ఆగిపోయారు. వెంటనే మోటార్లతో నీటిని తోడేయాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. అదే టైమ్‌కు అండర్ బ్రిడ్జి దాటేందుకు ప్రయత్నించి ఓ కారు మధ్యలో చిక్కుకుపోయింది.
జనం చోద్యం చూస్తూ ఉండిపోగా.. స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్షంలో తడుస్తూనే తన అనుచరులతో కలిసి నీటిలో ఆగిపోయిన కారును ఒడ్డుకు చేర్చారు. ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగటంతో మిగిలిన వాళ్లు కూడా ముందుకొచ్చారు. బాధ్యతగా మసులుకొన్న ఎమ్మెల్యేకి చేతులెత్తి నమస్కరించారు. ఈ సమయంలో కొందరు ఎమ్మెల్యే కారు నెట్టడాన్ని తీసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.
#MLAKotamReddy | #10TVNews | #Shorts | #10TV
— 10Tv News (@10TvTeluguNews) August 4, 2022
Watch ----->>>>>https://t.co/wN1Qy2JprS#Rain #Weather #RainEffect #HeavyRainfall #10TVNews pic.twitter.com/qqkCWlDmAC