'డిలీట్ చెయ్ రా' అంటూ విరుచుకుపడ్డ బాలయ్య.. వీడియో వైరల్
MLA Balakrishna Beat Party Worker. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ వ్యక్తిపై విరుచుకుపడ్డ వీడియో
By Medi Samrat Published on 6 March 2021 3:47 PM ISTహిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ వ్యక్తిపై విరుచుకుపడ్డ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ వ్యక్తిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చెయ్యి చేసుకున్నారు. హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురంలో ఓ ఇంటికి వెళ్లిన సమయంలో అక్కడ ఫోటో తీయడానికి అభిమాని ప్రయత్నించడంతో అతడిపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రచారంలో భాగంగా 9వ వార్డు అభ్యర్థిని ఇంటికి వెళ్లారు బాలయ్య. ఇంట్లో కార్యకర్తలతో మాట్లాడుతుండగా… అభిమాని వీడియో తీశాడు. దీనిని గమనించిన బాలయ్య.. అభిమాని చెంప చెల్లుమనిపించారు. ఫోటో తీయవద్దంటూ వారించిన ఆయన అనంతరం అభిమాని చెంపచెల్లుమనిపించారు. డిలీట్ చెయ్ రా అంటూ బాలయ్య ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. బాలయ్య కొడుతున్న వీడియోను అక్కడే ఉన్న కొందరు రికార్డు చేశారు. డిలీట్ చెయ్ రా అంటూ బాలయ్య రెచ్చిపోవడానికి కారణం ఏమిటా..? అని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు.
తన ప్రచారంలో భాగంగా వైసీపీ నేతలపై బాలకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనకు ఎన్నో పనులు ఉన్నాయని... ఎంతో బిజీగా ఉంటూ కూడా తాను ప్రజాసేవ చేస్తున్నానని చెప్పారు. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎందరికో సేవ చేస్తున్నాని.. ఇదే సమయంలో సినిమాల ద్వారా ప్రజలకు వినోదాన్ని కూడా పంచుతున్నానని చెప్పారు.
తాను తిడితే తనకన్నా ఎక్కువ బూతులు తిట్టేవారు ఎవరూ ఉండరని అన్నారు. తనకు సంస్కారం ఉందని... సంస్కారానికి కట్టుబడే తాను పద్ధతిగా వ్యవహరిస్తున్నాని చెప్పారు. వైసీపీ నేతలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం అభివృద్ధిని పక్కనపెట్టి వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటున్నారని.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదని చెప్పారు.