ఫలితాలు చూసి ఇప్పటికైనా చంద్రబాబు సిగ్గుపడాలి: వెల్లంపల్లి

Minister vellampalli comments on chandrababu.టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2021 9:36 AM GMT
Minister vellampalli comments on Chandrababu

ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్‌ ముగిసి, ఫలితాలు కూడా వెలువడ్డాయి. మొదటి నుంచి వైసీపీ తన ప్రాధాన్యత చూపుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక చివరి విడత పోలింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ 89 కి 75 స్థానాలు గెలిచిందని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. నేడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంట గెలిచి రచ్చగెలవాలని అంటారు.. అయితే చంద్రబాబు ఇంటా, రచ్చ రెండు చోట్ల దారుణంగా ఓడిపోతున్నారు.

ఈ ఫలితాల తరువాత చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని పేర్కొన్నారు. ఈ ఫలితాలు చూసైనా చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. కార్పోరేషన్ ఎన్నికల్లో విజయవాడలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని వెల్లంపల్లి పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదన్నారు. కుప్పం, టెక్కలి, తుని, మైలవరం లాంటి టీడీపీ కంచుకోటలను వైసీపీ బద్దలు కొట్టిందన్నారు.

కేశినేని నాని తన అఫిడవిట్‌లో లేబర్ కోర్టులో పెండింగ్ కేసు గురించి ప్రస్తావించారన్నారు. 1.47 కోట్లు రూపాయలు ఉద్యోగులకు చెల్లింపులు చేయాల్సి ఉందని వెల్లంపల్లి పేర్కొన్నారు. ఫలితాలు చూసైనా చంద్రబాబు సిగ్గుపడాలని ఇక వైసీపీ ని విమర్శించే ముందు తన గురించి తాను ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. రాజకీయాల నుంచి చంద్రబాబు దూరంగా వెళ్లి ఆయన గౌరవం నిలుపుకుంటే మంచిదని హితవు పలికారు. టీడీపీలోనే అనేక వర్గాలు ఉన్నాయన్నారు. వారిలో వారికే పడకుంటే ప్రజలకు ఎలా సేవ చేస్తారని ప్రశ్నించారు.


Next Story
Share it