ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన నిర్వాకాలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ చర్యలకు ఉపక్రమించారు. 22 మంది డాక్టర్లు, నర్సులపై చర్యలు చేపట్టేందుకు విచారణకు ఆదేశించారు. 2020 ఫిబ్రవరిలో ఎన్టీఆర్ జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రులలో జరిగిన నిర్వాకాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా ఏసీబీ ఆకస్మిక తనిఖీలలో అక్రమాలు బయటపడటంతో..ఈ ఏడాది జూన్‌లో ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదికను మంత్రి సత్యకుమార్ పరిగణనలోకి తీసుకున్నారు.
కాగా ఈ నివేదికలో అవినీతి, పాలనా వైఫల్యాలు, పర్యవేక్షణ లోపాన్ని మంత్రి గమనించారు. ఈ నివేదికలో ఇన్‌పేషెంట్లపై తప్పుడు లెక్కలు, మందుల వినియోగాన్ని నర్సులు సరిగా చూపలేదని గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో పరిస్థితికి ఈ ఏసీబీ నివేదిక అద్దం పట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు. డీసీహెచ్‌ఎస్‌తో పాటు మరో 9 మంది డాక్టర్లు.. 12 మంది హెడ్ నర్సులు.. స్టాఫ్ నర్సులపై మంత్రి సత్యకుమార్ తక్షణమే విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో పరిస్థితిపై ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వాసుపత్రుల్లో మార్పు తెచ్చేందుకు పటిష్టమైన చర్యల్ని చేపట్టాలని మంత్రి ఆదేశించారు.