అమరావతి: ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..అని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. ఈ మేరకు ఆయన రేపల్లె , వేమూరు నియోజకవర్గ కరకట్టకు ఆనుకుని ఉన్న లంక గ్రామాల ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేయాలి అని సూచించారు. కృష్ణానది కరకట్ట వెంబడి పరిస్థితిని అధికారులు ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవిన్యూ అధికారులకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
కరకట్ట ప్రాంతంలో గండి పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు సూచిస్తున్నా. కృష్ణానది పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు నదిని గాని, కాలువలు గాని దాటే ప్రయత్నం చేయవద్దు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. సోషల్ మీడియాలో జరిగే వదంతులను నమ్మవద్దు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కునేందుకు రాష్ట ప్రభుత్వం సిద్ధంగా ఉంది..అని మంత్రి సత్యప్రసాద్ స్పష్టం చేశారు.