చంద్రబాబు చీటర్ : మంత్రి రోజా తీవ్ర విమర్శలు
Minister Roja Sensational Comments On Chandrababu. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
By M.S.R Published on 31 May 2023 5:18 PM ISTటీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రైతులను ఎలా మోసం చేశారో అందరికీ తెలుసని.. యువతను చంద్రబాబు ఆదుకుంటాననడం పెద్ద జోక్ అన్నారు. గతంలో చంద్రబాబు చేసిన మోసాన్ని యువత మరిచిపోలేదని గుర్తు చేశారు. చంద్రబాబు లాంటి చీటర్ మరొకరు లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ పాలన చూసి చంద్రబాబుకు నవ నాడులు చిట్లి పోయాయంటూ మండిపడ్డారు. టీడీపీ ఛార్జ్‌షీట్ టీడీపీ నేతల పిచ్చికి పరాకాష్టగా అభివర్ణించారు. 600 హామీలు ఇచ్చి, ఆరు హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబని, ముఖ్యమంత్రి సంతకాలకు విలువ లేకుండా చేశారన్నారు. ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన వ్యక్తి బోండా ఉమా అన్నారు. అమ్మఒడి పథకాన్ని ఎగతాళి చేసి, ఇప్పుడు మళ్లీ ఆ పథకం ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారో చంద్రబాబు చెప్పాలన్నారు. నాలుగు తరాలు గుర్తు పెట్టుకునే విధంగా జగన్ నాలుగేళ్ల పాలన సాగిందన్నారు. 15 ఏళ్లు సీఎంగా కొనసాగి, తీరా ఇప్పుడు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తాను అంటే టీడీపీని నమ్మేవారు ఎవరూ లేరని రోజా అన్నారు.
రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతలకు సీఎం జగన్ అండగా నిలిచారు. రైతులను చంద్రబాబు ఎలా మోసం చేశారో అందరికీ తెలుసు. 3300 చికిత్సలకు ఆరోగ్యశ్రీ అందిస్తున్నది సీఎం జగన్ మాత్రమే. మేనిఫెస్టో అంటే చంద్రబాబుకు చిత్తు కాగితంతో సమానం. ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు.