టీడీపీ-జనసేనల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 118 మంది అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్ట్‌ను అనౌన్స్ చేశారు. ఇందులో టీడీపీకి 94 సీట్లు, జనసేనకు 24 సీట్లు కేటాంచారు. జనసేన ఒంటరిగా పోటీ చేసి ఉన్నా ఒక 20 సీట్లలో గెలిచేదని అభిమానులు చెబుతున్నారు. ఇంత తక్కువ సీట్లు జనసేనకు ఇవ్వడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.
మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. 24 సీట్లకే పవన్ ఎందుకు తల ఊపారో ప్రజలకు చెప్పాలని అన్నారు. ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారు? పవన్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని విమర్శించారు. పవర్ స్టార్.. పవర్‌లేని స్టార్ అయ్యారన్నారు. ఎవరితో పొత్తుపెట్టుకోవాలో తెలియని గందరగోళం వారిది. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేయాలో తెలియని దుస్థితని అన్నారు. కుక్క బిస్కెట్లు వేస్తే తోక ఊపినట్లు సీట్లు జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. పవర్ స్టార్ అంటూ.. పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్‌కు పొత్తు పెట్టుకోవడం ద్వారానే అర్థం అయ్యింది. 118 సీట్లు ప్రకటించినా ఇంకా గందరగోళం నెలకొంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితని మంత్రి రోజా విమర్శించారు.