వైసీపీ దెబ్బ ఎలా ఉంటుందో 2019లో చూపించాము.. మళ్లీ 2024లో కూడా చూపిస్తాం: మంత్రి రోజా

Minister Roja challenged TDP leader Chandrababu. మంత్రి రోజా టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్‌ విసిరారు

By M.S.R  Published on  19 March 2023 12:06 PM GMT
వైసీపీ దెబ్బ ఎలా ఉంటుందో 2019లో చూపించాము.. మళ్లీ 2024లో కూడా చూపిస్తాం: మంత్రి రోజా

Minister Roja challenged TDP leader Chandrababu


ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీలో జోష్ నింపాయి. వైసీపీ పతనం ఆరంభమైందని టీడీపీ నేతలు చెబుతూ ఉన్నారు. అయితే.. మంత్రి రోజా టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. టీడీపీ నేతలకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు ఎవరైనా కానీ రాజీనామా చేసి ఎన్నికలకు వస్తారా? అని ప్రశ్నించారు. పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించే మగాడు పుట్టలేదు అంటూ కామెంట్స్‌ చేశారు. ఇప్పటికే పలు ఎన్నికల్లో ప్రజలు 175 నియోజకవర్గాల్లో జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీని ఓడించారు. సింబల్‌పై ఏడేళ్ల నుంచి టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. టీడీపీకి అంత నమ్మకం ఉంటే లోకేష్‌ను ఎందుకు పోటీలో పెట్టలేదని ప్రశ్నించారు రోజా. కొద్ది మంది ఓటర్లు ఉన్న ప్రత్యేక ఎన్నికల్లో గెలుపు కాదు.. ప్రజా తీర్పుతో తాము గెలుపొందామని రోజా అన్నారు. వైఎస్సార్‌సీపీ దెబ్బ ఎలా ఉంటుందో 2019లో చూపించాము. మళ్లీ 2024లో కూడా చూపిస్తామని అన్నారు.


Next Story