ట్విట‌ర్‌లో తారాస్థాయికి చేరిన ప‌వ‌న్‌, మంత్రి పేర్ని నాని మాట‌ల యుద్దం

Minister Perni Nani counter on Pawan Klayan tweet.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Sep 2021 6:22 AM GMT
ట్విట‌ర్‌లో తారాస్థాయికి చేరిన ప‌వ‌న్‌, మంత్రి పేర్ని నాని మాట‌ల యుద్దం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రి పేర్ని నాని మ‌ధ్య ట్విట‌ర్ వేదిక‌గా యుద్దం న‌డుస్తోంది. ఓ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌లో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే మెన్న పేర్ని నాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. తీవ్ర ప‌ద‌జాలంతో పవ‌న్‌పై విమ‌ర్శలు చేసిన సంగ‌తి తెలిసిందే.

కాగా.. విమ‌ర్శ‌ల‌పై ప‌వ‌న్ త‌న‌దైన శైలిలో స్పందించారు. 'తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమే' నంటూ గత రాత్రి ట్వీట్ చేశారు ప‌వ‌న్‌. దీంతో పాటు 'హూ లెట్ ద డాగ్స్ ఔట్' అన్న పాట‌ను ట్వీట్ చేస్తూ ఇది త‌న‌కు న‌చ్చిన పాట‌ల్లో ఒకటి అని చెప్పారు.

ఇక ప‌వ‌న్ ట్వీట్‌పై మంత్రి పేర్ని నాని కూడా కౌంట‌ర్ ఇచ్చారు. 'జనం ఛీత్కారాలు,ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు.. వరాహ సమానులకు న'మస్కా'రాలు'అంటూ ట్వీట్ చేశారు. అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోను పోస్ట్ చేశారు. కాగా.. ఈ ట్వీట్ల‌పై జనసైనికులు, వైసీపీ శ్రేణుల మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్ద యుద్ధమే జరుగుతోంది.

Next Story
Share it