ఏపీకి బ‌య‌లుదేరిన సీఎం.. సింగ‌పూర్‌లోనే ఉండిపోయిన‌ మంత్రి..!

సింగ‌పూర్ లో మంత్రి నారాయ‌ణ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో క‌లిసి సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు మంత్రి నారాయ‌ణ‌.

By Medi Samrat
Published on : 30 July 2025 9:22 PM IST

ఏపీకి బ‌య‌లుదేరిన సీఎం.. సింగ‌పూర్‌లోనే ఉండిపోయిన‌ మంత్రి..!

సింగ‌పూర్ లో మంత్రి నారాయ‌ణ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో క‌లిసి సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు మంత్రి నారాయ‌ణ‌...అయితే సీఎం చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న ముగించుకుని తిరిగి ఏపీకి బ‌య‌లుదేర‌గా.. మంత్రి నారాయ‌ణ మాత్రం అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించిన మ‌రికొన్ని అంశాల‌పై అధ్య‌య‌నం చేసేందుకు సింగ‌పూర్ లోనే ఉన్నారు. బుధ‌వారం సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబుతో క‌లిసి మంత్రి నారాయ‌ణ ప‌లు అంశాల‌ను అధ్య‌య‌నం చేసారు..సింగ‌పూర్ లో ఉన్న ఎస్ జె సంస్ధ‌(సుర్బానా జురాంగ్)కార్యాల‌యాన్ని మంత్రి నారాయ‌ణ సంద‌ర్శించారు.పట్టణ మౌలిక వసతుల క‌ల్ప‌న‌కు సంబంధించి డిజైన్ల రూపకల్పనలో SJ సంస్థ కు దశాబ్దాల అనుభవం ఉంది...అమ‌రావ‌తిలో అమరావతిలో సూక్ష్మ స్థాయిలో పచ్చదనం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై SJ సంస్థ ప్రతినిధులతో చర్చించారు మంత్రి.అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం పచ్చదనం పెంపునకు సంబంధించి గతంలో సింగ‌పూర్ స్థూల‌ ప్రణాళిక ఇచ్చింది..అమరావతి స్మార్ట్ సిటీ నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తూ బ్లూ - గ్రీన్ సిటీగా నిర్మిస్తుంది ప్ర‌భుత్వం.....అమ‌రావ‌తిలో పెద్ద ఎత్తున నిర్మిస్తున్న రోడ్లు,భ‌వ‌నాలు,ఎల్పీఎస్ లే అవుట్ లు,పార్కుల్లో గ్రీన‌రీ ఏ విధంగా ఉండాల‌నేదానిపై ఎస్ జె సంస్ధ ప్ర‌తినిధులు ప‌లు ప్ర‌ణాళిక‌ల‌ను మంత్రి ముందుంచారు.

ఇక బుధ‌వారం మ‌ధ్యాహ్నం సింగ‌పూర్ లోని మెరీనా శాండ్స్ బే వ‌ద్ద ఉన్న శాండ్స్ ఎక్స్ పో అండ్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ను మంత్రి నారాయ‌ణ,సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు ప‌రిశీలించారు.ఈ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ సింగ‌పూర్ లోనే అతిపెద్దది...సుమారు 45 వేల సీటింగ్ తో ప‌లు మీటింగ్ హాల్స్ ఈ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో ఉన్నాయి.ఇదే క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో 11 వేల సీటింగ్ ఉన్న బాల్ రూం ఆగ్నేయాసియాలోనే అతి పెద్ద‌తి...క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ నిర్మాణం,ఉప‌యోగించిన సాంకేతిక‌త గురించి మంత్రి నారాయ‌ణ‌కు సింగ‌పూర్ ప్ర‌తినిధులు వివ‌రించారు...ఇప్ప‌టికే అమ‌రావ‌తిలో నాలుగు క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లు నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.సింగ‌పూర్ శాండ్స్ ఎక్స్ పో అండ్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ నిర్మాణంలో ఉప‌యోగించిన లేటెస్ట్ టెక్నాల‌జీని అమరావ‌తిలో ప‌లు నిర్మాణాల్లో ఉప‌యప‌డుతుంద‌ని మంత్రి నారాయ‌ణ భావిస్తున్నారు...

రేపు,ఎల్లుండి కూడా సింగ‌పూర్ లో ప‌లు ప్రాంతాల‌ను సంద‌ర్శించ‌నున్నారు మంత్రి నారాయ‌ణ‌...ఎల్లుండి సింగ‌పూర్ నుంచి బ‌య‌లుదేరి మ‌లేషియా కు వెళ్ల‌నున్నారు..మ‌లేషియా ఆర్ధిక రాజ‌ధాని పుత్ర‌జ‌య‌తో పాటు కౌలాలంపూర్ లో ప‌లు ప్రాంతాల్లో అధ్య‌య‌నం త‌ర్వాత ఈనెల రెండో తేదీ రాత్రికి ఏపీకి రానున్నారు మంత్రి నారాయ‌ణ‌.

Next Story