మరో డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
రాష్ట్రంలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
By - Knakam Karthik |
మరో డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
అమరావతి: రాష్ట్రంలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ప్రతిఏటా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్, 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ నిర్వహించి, టీచర్ పోస్టులను భర్తీ చెయ్యాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... టెట్, డిఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని అన్నారు. కొత్త డిఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలుచేయాలని సూచించారు. 2026 జనవరి లో నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ, స్పెషల్ డిఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి 423 విన్నపాలు తమ దృష్టికి రాగా, ఇప్పటికే 200 పరిష్కరించాం. మిగిలిన విన్నపాలు విధానపరమైన, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించినవని అధికారులు తెలిపారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్యసాధనకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, బేస్ లైన్ టెస్ట్ నిర్వహణకు విధివిధానాలు రూపొందించాలని అన్నారు.