'ఇంటర్‌ హాల్‌టికెట్స్‌ ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి'.. వీడియో షేర్‌ చేసిన మంత్రి లోకేష్‌

ఇంటర్‌ సెకండియర్‌ ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల ప్రాక్టికల్స్‌ హాల్ టికెట్లను విడుదల చేసినట్టు మంత్రి నారా లోకేష్‌ తెలిపారు.

By అంజి  Published on  7 Feb 2025 11:41 AM IST
Minister Nara Lokesh, inter hall tickets, APnews

'ఇంటర్‌ హాల్‌టికెట్స్‌ ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి'.. వీడియో షేర్‌ చేసిన మంత్రి లోకేష్‌

అమరావతి: ఇంటర్‌ సెకండియర్‌ ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల ప్రాక్టికల్స్‌ హాల్ టికెట్లను విడుదల చేసినట్టు మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. https://bie.ap.gov.in/ సైట్‌, ప్రభుత్వ వాట్సాప్‌ సర్వీస్‌ 'మనమిత్ర' (9552300009)లో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రీవియస్‌/ ఐపీఈ 2025 హాల్‌ టికెట్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఎంటర్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు.

త్వరలో టెన్త్‌ విద్యార్థులకు సైతం ఇదే అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఇంటర్‌ ప్రాక్టీకల్స్‌ ఈ నెల 10 నుంచి 20 వరకు, పరీక్షలు మార్చి 1 - 20 వరకు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మెటా భాగస్వామ్యంతో వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పలు రకాల ప్రభుత్వ సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 161 సేవలను వాట్సాప్‌ భాగస్వామ్యంలో అందిస్తున్నారు.

Next Story