Andhrapradesh: గుడ్‌న్యూస్‌.. టీచర్లకు ఇకపై ఒకటే యాప్‌

పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో మంత్రి నారా లోకేష్‌ సమీక్ష నిర్వహించారు.

By అంజి
Published on : 29 Jan 2025 6:42 AM IST

Minister Nara Lokesh, app, teachers, APnews

Andhrapradesh: గుడ్‌న్యూస్‌.. టీచర్లకు ఇకపై ఒకటే యాప్‌

అమరావతి: పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో మంత్రి నారా లోకేష్‌ సమీక్ష నిర్వహించారు. జీవో 117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య డైరెక్టర్ నిర్వహించిన సన్నాహక సమావేశాలలో వచ్చిన అభిప్రాయాలను, సూచనలను అధికారులు వివరించారు. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్‌ల స్థానంలో ఒకటే యాప్‌ను రిలీజ్ చేస్తామని చెప్పారు.

పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్ధారించేందుకు అపార్ ఐడీని అనుసంధానించే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆయా సూచనలను పరిగణనలోకి తీసుకుని ఏ విద్యార్థి డ్రాప్ అవుట్ అవకుండా చర్యలు చేపట్టాలన్నాను. ఉపాధ్యాయ బదిలీ చట్టంపైనా సమావేశంలో చర్చించారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి విద్యార్థులకు కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలని ఆదేశించాను. ప్రజాభిప్రాయసేకరణ కోసం ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్ ను సిద్ధం చేయాలని ఆదేశించారు.

Next Story