Video: 'హిందీ జాతీయ భాషే'.. మంత్రి లోకేష్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ హిందీ భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By అంజి
Published on : 15 July 2025 12:17 PM IST

Minister Nara Lokesh, Hindi language, APnews

Video: 'హిందీ జాతీయ భాషే'.. మంత్రి లోకేష్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

దేశంలో గత కొన్ని నెలలుగా భాషా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ హిందీ భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో హిందీని జాతీయ భాషగా పేర్కొన్నారు. అయితే యాంకర్‌ హిందీ జాతీయ భాష కాదు అని చెప్పగా.. మనం హిందీ ఎందుకు నేర్చుకోకూడదు? అని అన్నారు. జాతీయ భాషగా హిందీని ఎందుకు ముందుకు తీసుకెళ్లకూడదని లోకేష్‌ ప్రశ్నించారు. ఇంగ్లీష్‌లాగే హిందీ కూడా లింక్‌ లాంగ్వేజ్‌ అని పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సైతం ఇటీవల హిందీపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. హిందీ భాషను పెద్ద‌మ్మ అని సంబోధించారు. భారత రాజ్యాంగం ప్రకారం.. హిందీ అధికార భాషల్లో ఒకటి మాత్ర‌మే, అది జాతీయ భాషగా ప్రకటించబడలేదు. అలాగే దేశంలో 22 అధికార భాషలుండ‌గా.. రాజ్యాంగంలో ఏ భాషకూ ‘జాతీయ భాష’ హోదా ఇవ్వబడలేదు.

Next Story