ఆంధ్రప్రదేశ్‌లో నూతన రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఆగస్టు 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ పంపిణీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. క్యూ ఆర్ కోడ్‌తో అందించే కొత్త రేషన్ కార్డులపై నేతల ఫొటోలు ఉండవని మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు.
అటు ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల రేషన్ దుకాణాల్లో సరుకులు సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. డెబిట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు ఉంటాయని పేర్కొన్నారు.. ఐదేళ్లలోపు, 80 ఏళ్లు దాటినవారికి ఈకేవైసీ అవసరం లేదని వెల్లడించారు. అలాగే.. 25 నుంచి 30వ తేదీ వరకు వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ ఉంటుందని తెలిపారు.