కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ నిజమైన శత్రువు : మంత్రి కొట్టు

Minister Kottu Satyanarayana Fire on Pawan Kalyan. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat
Published on : 10 Jun 2023 7:50 AM IST

కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ నిజమైన శత్రువు : మంత్రి కొట్టు

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాపు సామాజికవర్గానికి నిజమైన శత్రువు పవన్ కళ్యాణ్ అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. కాపులకు అత్యంత అభిమానుడైన వంగవీటి రంగాను చంద్రబాబు హత్య చేయించారు. మూటలు అందిస్తున్నారని కాపు జాతిని మొత్తం చంద్రబాబు కాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ పెట్టేస్తున్నారన్నారు. పవన్ ఒక స్వార్ధపరుడు.. తన స్వార్థం కోసం కాపు జాతిని చంద్రబాబుకి తాకట్టు పెడుతున్నారని అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

ఏలూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ నిజంగా ప్రజల కోసం పని చేస్తే బాగుండేదని, కానీ ఆ పరిస్థితి లేదని అన్నారు. సినిమా షూటింగ్ లో 15 రోజులు గ్యాప్ తీసుకుని వచ్చే పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోతున్నారని.. పవన్ ధ్యేయం జగన్ మోహన్ రెడ్డిని దించేసి చంద్రబాబుని అధికారం ఎక్కించేయాలని మాత్రమేనని ధ్వజమెత్తారు. వారాహి యాత్రను ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబు చెబితే వాయిదా వేశారు. వారాహి స్టీరింగ్ చంద్రబాబు చేతిలోనే ఉందని అన్నారు. పవన్, జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం, ఆలోచన లేదని.. చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తారని అన్నారు. వైఎస్సార్ సంక్షేమ పరిపాలన మించి సీఎం వైఎస్ జగన్ పరిపాలన చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు.


Next Story