త్వరలో 3 లక్షల ఇళ్లు ప్రారంభం: మంత్రి కొలుసు

రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 3 లక్షల ఇళ్లను ప్రారంభిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమం అక్టోబర్‌ 29వ తేదీన జరగాల్సి ఉండగా..

By -  అంజి
Published on : 1 Nov 2025 7:29 AM IST

Minister Kolusu Parthasarathy, 3 lakh houses, APnews

త్వరలో 3 లక్షల ఇళ్లు ప్రారంభం: మంత్రి కొలుసు

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 3 లక్షల ఇళ్లను ప్రారంభిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమం అక్టోబర్‌ 29వ తేదీన జరగాల్సి ఉండగా.. మొంథా తుఫాను కారణంగా వాయిదా పడిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కోసం కొత్త తేదీని నిర్ణయించే పనిలో ఉందన్నారు. వాతావరణం సద్దుమణిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే అర్బన్‌ పరిధిలో 41 వేల ఇళ్లను మంజూరు చేశామన్నారు. రూరల్‌ పరిధిలో ఇంకా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వచ్చే నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు.

ఈ నిర్ణయంతో అర్హులైన వేలాది కుటుంబాలు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకునే ఛాన్స్‌ని పొందుతాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ కింద మౌలిక వసతులు, నీరు, విద్యుత్, రహదారులు వంటి ఫెసిలిటీలను సమగ్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మరోవైపు ఏపీ టిడ్కోకు ప్రభుత్వం రూ.540 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు హౌసింగ్ ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు ఉపయోగించబడనున్నాయి. ఈ నిధులతో టిడ్కో కింద ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇళ్ల పనులను పూర్తి చేయడం, కొత్తగా ఆమోదం పొందిన ప్రాజెక్టులను ప్రారంభించడం జరుగుతుంది.

Next Story