త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి: మంత్రి అంబటి

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నామంటూ.. ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

By అంజి  Published on  11 Oct 2023 12:50 PM IST
minister ambati rambabu, AP Elections, APnews, Nara Lokesh

త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి: మంత్రి అంబటి

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నామంటూ.. ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మంత్రి అంబటి మీడియాతో మాట్లాడారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. ఈ నెల 26 నుంచి బస్సు యాత్ర చేయబోతున్నామని తెలిపారు. మళ్లీ జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నామని తెలిపారు. చంద్రబాబు, నారా లోకేష్‌ ఇద్దరూ వేలకోట్లు దోచుకున్నారని మంత్రి అంబటి ఆరోపించారు. ఎన్నికల ముందు కక్ష సాధింపు ఏంటి? అని అంటున్నారని, స్కిల్‌ స్కాం కేసులో ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును అరెస్ట్‌ చేశారని అన్నారు.

రాజశేఖర్‌ రెడ్డే నన్నేం చేయలేకపోయాడు.. జగన్‌ మోహన్‌ రెడ్డి ఏం చేస్తాడు అని చంద్రబాబు అన్నాడని, ఇప్పుడు సెంట్రల్ జైలులో పెట్టాడని ఎద్దేవా చేశారు. కక్ష సాధింపులు చేయాల్సిన అవసరం వైసీపీకి లేదని అన్నారు. నోరు పారేసుకుంటే ఇలాగే ఉంటుందని అన్నారు. లోకేష్‌ వల్లే టీడీపీ నాశనమైందన్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా ఆ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఏం బలం ఉందని టీడీపీకి మద్దతిస్తాడని అన్నారు. టీడీపీని కాపాడటం ఎవరి వల్లా కాదని మంత్రి వ్యాఖ్యానించారు.

Next Story