మానవత్వం చాటిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

Mekapati Gautam Reddy, the minister who spread humanity. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు.

By Medi Samrat
Published on : 1 March 2021 11:10 AM IST

Mekapati Gautam Reddy

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదాన్ని గమనించిన మంత్రి కాన్వాయ్ ని నిలిపివేసి తక్షణ రక్షణ చర్యలు చేపట్టి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి(45)ని ఆస్పత్రికి తరలించారు. వివ‌రాళ్లోకెళితే.. నెల్లూరు జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి.. తాడేపల్లి సీఎం కార్యాలయంలో జరగనున్న ముఖ్యమంత్రి సమావేశానికి మంత్రి హాజరయ్యేందుకు రోడ్డుమార్గంలో కాన్వాయ్‌తో వస్తున్నారు.

మంత్రి కాన్వాయ్‌ చిలకలూరిపేట ప్రాంతం రోడ్డుపై వెళుతుండ‌గా.. ఓ ద్విచక్రవాహనదారుడు యూ టర్న్ తీసుకుంటున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టాడు. దీంతో అత‌డికి తీవ్ర‌గాయాల‌య్యాయి. మంత్రి వెంట‌నే కాన్వాయ్ ఆపి దగ్గరుండి సహాయక చర్యలు చేప‌ట్టారు. స్థానిక ఎమ్మెల్యే విడుదల రజనీ సహా ఎస్ఐతో ఫోన్ లో మాట్లాడి అప్రమత్తం చేశారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని మంత్రి ఆదేశించారు. క్షతగాత్రుడు ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందినవారని ప్రాథమిక సమాచారం.




Next Story