ఏపీలో క్రీడల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.1,106 కోట్లతో 53 ప్రాజెక్టుల ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.

By -  Knakam Karthik
Published on : 11 March 2026 8:22 PM IST

Andrapradesh, Sports Development, Khelo India, SAAP, SportsInfrastructure

ఏపీలో క్రీడల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.1,106 కోట్లతో 53 ప్రాజెక్టుల ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ 'ఖేలో ఇండియా' పథకం కింద సుమారు ₹1,106 కోట్ల విలువైన 53 ప్రాజెక్టుల ప్రతిపాదనలను SAAP చైర్మన్ ఎ. రవి నాయుడు బుధవారం న్యూఢిల్లీలో ఉన్నతాధికారులకు సమర్పించారు.

రాష్ట్రంలోని విస్తారమైన తీరప్రాంతం మరియు జలాశయాలను వినియోగించుకుంటూ మచిలీపట్నం, ఏలూరు, తిరుపతి, విజయనగరం వంటి తొమ్మిది ప్రాంతాల్లో వాటర్ స్పోర్ట్స్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి కోరారు. వీటితో పాటు తిరుపతి సమీపంలోని దామినేడులో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లేదా SAI ప్రాంతీయ కేంద్రాన్ని నెలకొల్పాలని ప్రతిపాదించారు.

అలాగే అరకు లోయలో అంతర్జాతీయ సాహస క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. ఈ ప్రతిపాదనలపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో SAAP మేనేజింగ్ డైరెక్టర్ భరణి కూడా పాల్గొన్నారు.

Next Story