ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By Knakam Karthik  Published on  20 Jan 2025 8:53 PM IST
andrapradesh, ips transfers

ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్ మీనా, కర్నూల్ ఎస్పీగా విక్రాంత్ పాటిల్, కాకినాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బిందు మాధవ్, ఎర్రచందనం యాంటీ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బరాయుడు, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్‌గా పాలరాజు, ఐజీపీ ఆపరేషన్స్‌గా సీహెచ్‌ శ్రీకాంత్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.


Next Story