మలుపు వద్ద డ్రైవర్ మిస్టేక్, పేలిన డీజిల్ ట్యాంక్..మార్కాపురం బస్సు ప్రమాదానికి కారణాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 26 March 2026 1:59 PM IST

Andrapradesh, PrakasamDistrict, Markapuram Bus Accident, Road Tragedy, Bus Fire

మలుపు వద్ద డ్రైవర్ మిస్టేక్, పేలిన డీజిల్ ట్యాంక్..మార్కాపురం బస్సు ప్రమాదానికి కారణాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు, స్థానిక స్లేట్ క్వారీల వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ ట్రక్కును అతివేగంతో ఢీకొనడంతో జరిగిన ఘోర ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాద తీవ్రతకు బస్సులోని డీజిల్ ట్యాంక్ ఒక్కసారిగా పగిలిపోవడంతో వాహనం మంటల్లో చిక్కుకుంది. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండటం, మంటల ధాటికి బస్సు తలుపులు జామ్ కావడంతో లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారు. చూస్తుండగానే బస్సు మంటల గోళంగా మారడంతో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

డ్రైవర్ అజాగ్రత్త, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని, క్వారీ ప్రాంతంలోని మలుపు వద్ద వాహనంపై నియంత్రణ కోల్పోయి టిప్పర్‌ను నేరుగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. నిమిషాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా కాలి అస్థిపంజరంలా మారిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మృతదేహాలను వెలికితీసి, తీవ్రంగా గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story