మాజీ ఎమ్మెల్యేల హ‌త్య‌కేసు ప్ర‌ధాన నిందితుడు, మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు రైనో అరెస్టు

Maoist Srinubabu Arrest in Andhra and Odisha Border. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు అల్లూరి జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో

By Medi Samrat  Published on  22 Feb 2023 2:19 PM GMT
మాజీ ఎమ్మెల్యేల హ‌త్య‌కేసు ప్ర‌ధాన నిందితుడు, మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు రైనో అరెస్టు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు అల్లూరి జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు నేత జనుమూరు శ్రీనుబాబు అలియాస్‌ రైనో అలియాస్‌ సునీల్‌ పట్టుబడినట్టు సీలేరు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. 2018 సెప్టెంబర్‌ 23న జరిగిన మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోము ల‌ హత్యకేసులో జనుమూరు శ్రీనుబాబు ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఐఈడీ, తుపాకీ, పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏవోబీ ప్రత్యేక జోన్‌ డివిజినల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న శ్రీనుబాబు ఏఓబీలో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టుగా ఉన్నాడు. శ్రీనుబాబుపై రూ.5లక్షల రివార్డు కూడా ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.


Next Story