ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి..తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో మంత్రి లోకేష్

గత అయిదేళ్ల విధ్వంస పాలన చూశాక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగువారంతా స్వచ్చందంగా ముందుకు వచ్చారు..అని రాష్ట్ర ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు.

By Knakam Karthik
Published on : 28 July 2025 10:57 AM IST

Andrapradesh, Minister Nara Lokesh, Telugu Diaspora, volunteers, AP at Singapore

ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి..తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో మంత్రి లోకేష్

గత అయిదేళ్ల విధ్వంస పాలన చూశాక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగువారంతా స్వచ్చందంగా ముందుకు వచ్చారు..అని రాష్ట్ర ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఏ దేశం వెళ్లినా ముఖ్యమంత్రి , నేను తొలుత తెలుగువాళ్లను కలవాలని నిర్ణయించుకున్నామని నారా లోకేశ్ చెప్పారు. తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లతో లోకేష్ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును మనమంతా స్పూర్తిగా తీసుకోవాలి. ఇక్కడ ఉన్న తెలుగు వారంతా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలి. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావడం వల్ల రాష్ట్రం ఊపిరి తీసుకుంటోంది. ప్రధాని మోడీజీ త్వరలోనే సింగపూర్‌లో పర్యటిస్తారు. ఆ పర్యటనలో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొని విజయవంతం చేయండి. రాష్ట్రానికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలపాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లను అభినందించిన లోకేష్ వారితో ఫోటోలు దిగారు.

Next Story