BJP final list: ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. తెలంగాణ నుంచి ఇద్దరు
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆదివారం లోక్‌సభ ఎన్నికలకు మొత్తం 111 మంది పోటీదారుల పేర్లతో ఐదవ, చివరి అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది.
By అంజి Published on 25 March 2024 2:07 AM GMTఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. తెలంగాణ నుంచి ఇద్దరు
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆదివారం లోక్‌సభ ఎన్నికలకు మొత్తం 111 మంది పోటీదారుల పేర్లతో ఐదవ, చివరి అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. బీహార్‌లోని బెగుసరాయ్ నియోజకవర్గానికి గిరిరాజ్ సింగ్, ఉజియార్‌పూర్‌కు నిత్యానంద్ రాయ్, పాట్నా సాహిబ్‌కు రవిశంకర్ ప్రసాద్, పూరీ నుండి సంబిత్ పాత్ర మరియు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుండి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముఖ్యమైన నామినేషన్లలో ఉన్నారు. తెలంగాణలో వరంగల్ (ఎస్సీ) నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్‌రావులను పార్టీ బరిలోకి దించింది.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం నుంచి పోటీ చేస్తున్నారు. నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేశ్ పోటీ చేస్తారని అధిష్టానం వెల్లడించింది. అయితే అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ఇంకా వెల్లడించలేదు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంబల్‌పూర్ నుంచి పోటీ చేయనున్నారు. పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర 2019లో గట్టి పోటీలో ఓడిపోయిన తర్వాత మరోసారి పూరీ నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పార్టీ సుల్తాన్‌పూర్ నుంచి మేనకా గాంధీని నిలబెట్టగా, ఉత్తరప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాద పిలిభిత్‌లో వరుణ్ గాంధీ స్థానంలో ఉన్నారు. సీతా సోరెన్ దుమ్కా (జార్ఖండ్) నుంచి పోటీ చేయనున్నారు.
ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి అనంత్ కుమార్ హెగ్డేను పార్టీ తప్పించింది. ప్రముఖ టీవీ సీరియల్ రామాయణంలో రాముడిగా నటించిన నటుడు అరుణ్ గోవిల్‌ను మీరట్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ పోటీకి దింపింది. ఏడు దశల పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.
The Central Election Committee of the Bharatiya Janata Party has decided on the following names for the upcoming General Elections to the Lok Sabha. Here is the fifth list. (1/3) pic.twitter.com/lKmJke6WOb
— BJP (@BJP4India) March 24, 2024
The Central Election Committee of the Bharatiya Janata Party has decided on the following names for the upcoming General Elections to the Lok Sabha. Here is the fifth list. (3/3) pic.twitter.com/t88Ge9Vtmd
— BJP (@BJP4India) March 24, 2024