దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా.. కొన్నిరాష్ట్రాల్లో మాత్రం తీవ్రంగానే విజృంభిస్తోంది. ఇక దేశంలో కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అక్కడ ప్రతి రోజు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారని వస్తున్న వార్తలపై నిజమయ్యేలా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే పరోక్షంగా హెచ్చరికలు వాస్తవం అయ్యాయి. రాష్ట్రంలోని అమరావతి జిల్లా వ్యాప్తంగా ఈ శనివారం నుంచి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మహారాష్ట్రలో కేసుల సంఖ్య తగ్గినా తర్వాత తీవ్రస్థాయిలో పెరిగిపోయాయి. ఈ విషయమై ముంబై మేయర్ ఇప్పటికే పలు మార్లు హెచ్చరికలు జారీ చేశారు. ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణిస్తున్న వారరు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, లేకపోతే లాక్‌డౌన్ విధించక తప్పని హెచ్చరించారు.
ఇక తాజాగా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో రెండు రోజుల పాటు లాక్‌డౌన్ విధించనున్నారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని అమరావతి జిల్లా కలెక్టర్ శేలేష్ నవల్ ప్రకటించారు.
అయితే గతంలో లాక్‌డౌన్‌లో ఉన్న నిబంధనలు ఇప్పుడు కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో లాక్‌డౌన్ విధించక తప్పడం లేదన్నారు. అలాగే రాష్ట్రలో మరి కొన్ని ప్రాంతాల్లో కూడా లాక్‌డౌన్ విధించక తప్పదేమోనన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.