ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం 89,882 దరఖాస్తులు వచ్చాయి. అక్టోబరు 16న రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. టెండర్ ప్రక్రియ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 1,797.64 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రతి మద్యం దుకాణానికి సగటున 25 నుండి 26 దరఖాస్తులు వచ్చినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం దుకాణాలకు 5,800 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దుకాణానికి సగటున 50 నుంచి 51 దరఖాస్తులు వచ్చాయి. అల్లూరి జిల్లాలో తక్కువ దరఖాస్తులు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మద్యం షాపుల దరఖాస్తులు ఇంత స్థాయిలో రావడం ఇదేనని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. షాప్ కేటాయింపులను నిర్ణయించడానికి అక్టోబర్ 14 న లాటరీ డ్రా నిర్వహించనున్నారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం అనేక రకాల మద్యం బ్రాండ్ లు అందుబాటులోకి రానున్నారు.