ఏపీలో మొద‌లైన‌ తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

Last Phase Local Body Elections In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఆదివారం ఉదయం

By Medi Samrat  Published on  21 Feb 2021 8:54 AM IST
Last Phase Local Body Elections In AP.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఆదివారం ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఈ పోలింగ్ జరగుతుంది. అనంత‌రం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలౌతుంది. ఆ తరువాత ఫలితాలు ప్ర‌క‌టిస్తారు.


ఇదిలావుంటే.. తుది దశకు చేరుకున్న పంచాయితీ‌ ఎన్నిక‌లు.. 13 జిల్లాల్లోని 161 మండలాల్లో పోలింగ్ జరుగుతున్నాయి. మొత్తం 3299 పంచాయతీలు, 33,435 వార్డులకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుద‌ల‌ చేయగా.. అందులో 553 పంచాయతీలు, 10,921 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

దీంతో ప్రస్తుతం 2744 పంచాయతీలు, 22,422 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక 7475 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవుల బరిలో ఉండగా, 49,089 మంది అభ్యర్థులు వార్డు పదవుల బరిలో నిలిచారు. మొదటి మూడు విడతల ఎన్నికల్లో అధికార వైసీపీ మద్ద‌తుదారులు ఎక్కువ‌చోట్ల‌ విజయాలు నమోదు చేసుకున్నారు.


Next Story