కర్ణాటకలో మరోసారి భాషా వివాదం తెరపైకొచ్చింది. ఓ షాపింగ్ మాల్‌కు తెలుగులో ఉన్న పేరు తొలగిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. కర్ణాటక రక్షణ వేదిక, బళ్లారి, విజయనగర జిల్లా అధ్యక్షుడు జి.రాజశేఖర్ రాజన్న ఆధ్వర్యంలో ఆకృతి తెలుగు అక్షరాలను సైన్ బోర్డు నుంచి తొలగించారు. అయితే దానిపై తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'తెలుగు రాష్ట్రాల్లో కన్నడలోని బోర్డులను ఎవరూ టచ్ చేయరు. ఇంకెన్నాళ్లు ఇలాంటి డ్రామాలాడతారు? రాష్ట్రం పరువు తీస్తున్నారు. వీళ్లెంత దిగజారిపోయారంటే పక్క రాష్ట్రాల్లో ఉండే కన్నడిగుల గురించి కూడా ఆలోచించరా?' అని నిలదీస్తున్నారు.
ఎక్స్‌లో ఈ వీడియోపై ఓ యూజర్ స్పందిస్తూ.. ''దయచేసి అందరూ కళ్ళు తెరవాల్సిన సమయం ఇది... సినిమా వరకే సమస్య అనుకుంటే భాష కూడా సమస్య ఐపోయింది వాళ్ళకి... మన రాష్ట్రంలో కన్నడ బోర్డు ఏం ఉన్న వెంటనే తెలుగులోకి మార్చండి'' అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ట్యాగ్ చేశారు.