Tirupati: స్పైసీ ఫుడ్‌పై.. ఆర్ట్స్‌ కాలేజీలో విద్యార్థుల గ్రూప్‌ వార్‌

తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ హాస్టల్‌లో స్పైసీ ఫుడ్‌పై విద్యార్థుల మధ్య గ్రూప్‌ వార్‌ జరిగింది. భోజనంలో కారం విషయమై విద్యార్థులు గొడవ పెట్టుకున్నారు.

By అంజి  Published on  26 July 2023 6:03 AM GMT
Kurnool , Nellore students, group war, Tirupati Arts College, spicy food

Tirupati: స్పైసీ ఫుడ్‌పై.. ఆర్ట్స్‌ కాలేజీలో విద్యార్థుల గ్రూప్‌ వార్‌ 

తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ హాస్టల్‌లో స్పైసీ ఫుడ్‌పై విద్యార్థుల మధ్య గ్రూప్‌ వార్‌ జరిగింది. భోజనంలో కారం విషయమై విద్యార్థులు గొడవ పెట్టుకున్నారు. కర్నూలు, నెల్లూరు జిల్లాల విద్యార్థులు.. రెండు గ్రూప్‌లుగా ఏర్పడిగా ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో అర డజనుకుపైగా విద్యార్థులు గాయపడ్డారు. శని, ఆదివారాల్లో విద్యార్థుల మధ్య వివాదాలు జరిగినట్టు సమాచారం. ఈ గొడవలో ఓ విద్యార్థి తలకు గాయమైంది. ప్రస్తుతం గాయపడిన విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ఈ వివాదానికి కారణమైన 30 మందిని కాలేజీ హాస్టల్‌ నుండి అధికారులు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్‌ అయిన వారిలో డిగ్రీ ఫస్ట్‌, సెకండీయర్‌ విద్యార్థులు

హాస్టల్‌లో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, స్టడీ అవర్స్‌కు సైతం సరిగా హాజరు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నిత్యం హాస్టల్‌ మెస్‌ వర్కర్లతో వాగ్వాదానికి దిగుతున్నారని, విద్యార్థులను గొడవలకు ప్రేరేపిస్తున్నారని పేర్కొంటూ ఈ అంశాలపై విద్యార్థుల నుంచి అధికారులు వివరణ కోరారు. సస్పెండ్‌కు గురైన విద్యార్థులను హాస్టల్‌, మెస్‌లలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. కర్నూల్ రాయలసీమలో భాగమైన కారపు వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వారు ఎక్కువగా కారంతో కూడి భోజనం చేస్తారు. ఈ క్రమంలోనే తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ హాస్టల్‌లో భోజనం రుచి విషయమై నెల్లూరు జిల్లా విద్యార్థులతో గొడవ జరిగినట్టు తెలుస్తోంది.

Next Story