పవన్‌కు చంద్రబాబు వల్లే ప్రాణహాని.. కొట్టు సంచలన వ్యాఖ్యలు

పవన్‌కు ప్రాణహాని ఉంది.. కానీ అది చంద్రబాబు నుంచే అన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.

By Srikanth Gundamalla
Published on : 18 Jun 2023 4:46 PM IST

Deputy CM Kottu Satyanarayana, Pawan Kalyan, Janasena, AP

పవన్‌కు చంద్రబాబు వల్లే ప్రాణహాని.. కొట్టు సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తనకు ప్రాణ హాని ఉందంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే తన చుట్టూ ఎప్పుడూ సెక్యూరిటీ ఉంటారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ స్పందించారు. పవన్‌కు ప్రాణహాని చంద్రబాబు వల్లే ఉందంటూ కౌంటర్‌ ఇచ్చారు.

ఆదివారం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్ అవగామన రాహిత్యంతో మాట్లాడుతున్నారని అన్నారు. వారాహి యాత్రలో పవన్ అవాకులు చవాకులు పేలుతున్నాడంటూ విమర్శించారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ను ఎవరికైనా చూపించాలని ప్రజలే అనుకుంటున్నారని కొట్టు సత్యనారాయణ అన్నారు. గుంట నక్కలాంటి వ్యక్తం చంద్రబాబుని.. ప్రజలు ఈ సారి కూడా ఓడించడం ఖాయమన్నారు. చంద్రబాబుతో పవన్‌ ఉన్నారు కాబట్టే అతన్ని కూడా ఓడించారని అన్నారు. పవన్ వెంట కాపులు ఉండరని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పే దుమ్ము కూడా పవన్‌ కల్యాణ్‌కు లేదన్నారు. అయితే.. పవన్‌కు ప్రాణహాని ఉంది.. కానీ అది చంద్రబాబు నుంచే అన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.

చంద్రబాబు తన పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గతంలో ఏం చేశామో చెప్పి ఓట్లు అడిగే దమ్ము చంద్రబాబుకి లేదన్నారు. టీడీపీ హయాంలో కృష్ణా పుష్కరాల పేరిల 44 ఆలయాలను కూల్చేశారన్నారు. వైసీపీ పాలనలో 250 ఆలయాలకు దాదాపు రూ.281 కోట్ల రూపాయలను కేటాయించి అభివృద్ధికి కృషి చేశామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చెప్పారు.

Next Story