కేజీ చికెన్ రూ.10వేలు..!

Kosa Chicken full demand in AP. ప్ర‌స్తుతం దేశంలో బ‌ర్డ్‌ప్లూ క‌ల‌క‌లం రేపుతోంది. కానీ అక్కడ కేజీ చికెన్ రూ.10వేలు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jan 2021 10:12 AM GMT
Kosa Chicken full demand in AP

ప్ర‌స్తుతం దేశంలో బ‌ర్డ్‌ప్లూ క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల్లో బ‌ర్డ్ ప్లూ దాటికి వేల సంఖ్య‌లో కోళ్లు, కాకులు, బాతులు ప్రాణాలు కోల్పోయాయి. దీంతో బ‌ర్డ్ ప్లూ ఉన్న రాష్ట్రాల్లో చికెన్ విక్ర‌యాల‌ను నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. 15 రోజుల క్రితం కేజీ చికెన్ రూ.250 ప‌లుక‌గా.. ప్ర‌స్తుతం రూ.120-140 మ‌ధ్య ఉంది. బ‌ర్డ్ ప్లూ భ‌యంతో చాలా మంది చికెన్‌ను తిన‌డం మాన‌డంతో.. ధ‌ర‌లు భారీగా ప‌త‌నం అవుతున్నాయి.

అయితే.. అక్క‌డ మాత్రం కేజీ చికెన్ ధ‌ర రూ.3వేల నుంచి 10వేల వ‌ర‌కు ప‌లుకుంది. అవును ఇది నిజం. ఎక్క‌డో కాదండీ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే. సంక్రాంతి పండ‌క్కి ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌తో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప‌లుచోళ్ల కోళ్ల పందాలు వేస్తున్నారు. కోళ్ల పందాల కోసం పుంజులను పెంచేవాళ్లు మంచి ఆహారాన్ని అందిస్తారు. పిస్తా, బాదం పప్పు, జీడిపప్పు లాంటి మంచి పౌష్టికాహారం అందిస్తారు. అలాగే, వ్యాయామం చేయిస్తారు. పుంజులు మంచి దిట్టంగా ఉండడం, కూర రుచిగా ఉండడం, తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్న నమ్మంతో.. చికెన్ ప్రియులు డబ్బులకు వెనుకాడకుండా పందెంలో ఓడిన కోళ్లను కొనేందుకు ఎగబడుతున్నారు.

పందెంలో ఓడిన కోడిని.. కొసా లేదా కోజాగా పిలుస్తారు. ఒక్కో కోడి కనీసం రూ.3000 ధర పలుకుతోంది. నాసి రకం కోళ్లు అయితే రూ.3000 నుంచి రూ.4000 వరకు ఉంది. అదే.. మంచి మేలు జాతి పుంజు అయితే, రూ.8వేల నుంచి రూ.10వేలకు అమ్ముతున్నారు. అయిన‌ప్ప‌టికి జ‌నం మాత్రం ఈ కోళ్ల‌ను కొనేందుకు పోటీ ప‌డుతుంటారు. మిగిలిన వాటితో పోలీస్తే.. ఈ కొసా రుచే చాలా వేరుగా ఉంటుంద‌ని అంటుంటారు.


Next Story
Share it