ఏపీలో ప్రభుత్వం కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ.. నిరుద్యోగ, యువజన, విద్యార్థి సంఘాలు నేడు 'చలో తాడేపల్లి'కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో విద్యార్థి సంఘాలు నేతలు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరెస్టులపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ విషయమై స్పందించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జగన్ సర్కార్‌పై ఫైర్ అయ్యారు.
సీఎం జగన్ మాట తప్పడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ విషయంలో జగన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు సమాధానం చెప్పలేకే బలవంతపు అరెస్ట్‌లు చేయిస్తున్నారని విమర్శించారు. శాంతియుత ఉద్యమాలపై పోలీసులు ఉక్కుపాదం సిగ్గుచేటన్నారు. అరెస్ట్ చేసిన నిరుద్యోగులను తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.