టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు. అవినీతి పనులు చేసే చంద్రబాబును అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఐటీ నోటీసులపై ఎందుకు నోరు విప్పరు? అని నిలదీశారు. పాలు అమ్మితే పదివేల కోట్ల ఆదాయమా..? పాలు, పిడకలు అమ్మి దేశంలో ఎవరూ ఇంత ఆదాయం సంపాదించలేదన్నారు. ఇక, దోచుకున్న డబ్బును వైట్ చేసేందుకే చంద్రబాబు పాల వ్యాపారం పెట్టారని ఆరోపించారు. మనం చేసిన మంచి పనులను ప్రజలు చెప్పాలని విమర్శలు గుప్పించారు. చంద్రబాబులా సెల్ఫీలు తీసుకొని చెప్పుకోవడమెంటో..! అంటూ ప్రశ్నించారు.
ఇక హైదరాబాద్ తానే కట్టానని చెప్పుకునే చంద్రబాబుకు అక్కడ డిపాజిట్ రాదని అన్నారు కొడాలి నాని. పిట్టల దొర లేని లోటుని చంద్రబాబు నాయుడు తీరుస్తున్నాడని చంద్రబాబుపై సెటైర్లు వేశారు కొడాలి నాని. రాష్ట్రంలో ఐదుగురు వ్యక్తులు మాత్రమే సంపదని దోచుకోవాలని కుట్రలు చేస్తున్నారన్నారు. అవినీతి పనులు చేసే చంద్రబాబును త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు.