ఐ-పాక్‌ కీలక ప్రకటన

2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గెలుపు కోసం తాము పనిచేస్తున్నట్టు ఐపాక్‌ సంస్థ కీలక ప్రకటన చెప్పుకొచ్చింది.

By Medi Samrat
Published on : 23 Dec 2023 8:43 PM IST

ఐ-పాక్‌ కీలక ప్రకటన

2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గెలుపు కోసం తాము పనిచేస్తున్నట్టు ఐపాక్‌ సంస్థ కీలక ప్రకటన చెప్పుకొచ్చింది. ఐపాక్‌ ట్విట్టర్‌ వేదికగా..‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు మా వంతు తోడ్పాటు అందిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీతో కలిసి పనిచేస్తున్నాం. 2024 ఎన్నికల్లో​ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గెలుపుకోసమే మేము పనిచేస్తాం’ అని స్పష్టం చేసింది.

ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్.. శ‌నివారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో క‌లిసి కనిపించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి కూడా ఇద్దరూ ఒకే వాహనంలో చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. ఏపీలో త్వ‌ర‌లో ఎన్నికలు జరుగ‌నున్న‌ నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే ఎన్నికల కోసం ఏపీలో టీడీపీ, జనసేన ఇప్ప‌టికే పొత్తు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ వీరికి తోడు అయ్యాడు.

Next Story