ఓబుళాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లీజు సరిహద్దులు గుర్తించి ఎంతమేర అక్రమ మైనింగ్ చేశారో తేల్చేందుకు సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుధాంశు ధులియా నేతృత్వంలోని ఏడుగురితో సుప్రీంకోర్టు ఈ కమిటీని నియమించింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కమిటీ సభ్యులుగా కేంద్ర పర్యావరణ సాధికార కమిటీ నుంచి ఒకరు, కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఇద్దరు, రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ నుంచి ముగ్గురు ఉంటారని పేర్కొంది. మూడు నెలల్లో నివేదిక అందించాలని కమిటీని సుప్రీంకోర్టు సూచించింది.