అలాంటి వారి వల్లే తెలుగుదేశం పార్టీ మట్టిలో కలిసిపోయింది
Kakani Govardhan Reddy Fires On Ayyanna Pathrudu. ముఖ్యమంత్రి జగన్ మీద అయ్యన్నపాత్రుడు నోరు పారేసుకోవడం సరికాదని ఎమ్మెల్యే కాకాణి
By Medi Samrat
ముఖ్యమంత్రి జగన్ మీద అయ్యన్నపాత్రుడు నోరు పారేసుకోవడం సరికాదని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అయ్యన్నపాత్రుడు లాంటి వారి వల్లే తెలుగుదేశం పార్టీ మట్టిలో కలిసిపోయిందని తీవ్రవ్యాఖ్యలు చేశారు. మంత్రులను, అధికారులను ఉద్దేశించి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అని అన్నారు. అయ్యన్నపాత్రుడు లాంటి దిగజారుడు వ్యక్తుల ప్రవర్తనల వల్ల సమాజం సిగ్గు పడుతుందని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ని దూషించినందువల్ల అయ్యన్న పాత్రుడి స్థాయి దిగజారిందే తప్ప.. ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలగదని అన్నారు.
అయ్యన్నపాత్రుడు లాంటి వారిని నడిరోడ్డు మీద తరిమి, తరిమి కొట్టే పరిస్థితి ఉన్నా.. వైసీపీ నాయకులు సమన్వయం పాటిస్తూ, అలాంటి చర్యలకు పాల్పడటం లేదని అన్నారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే అయ్యన్న పిచ్చి ప్రేలాపనలు మొదలుపెట్టాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు ముందు నిరసన తెలపడానికి వైసీపీ కార్యకర్తలు వెళ్లితే, వారిపై తెలుగుదేశం గూండాలు దాడి చేయడం దుర్మార్గమని అన్నారు.
చంద్రబాబు తన చుట్టూ గూండాలను పెట్టుకొని, విద్వేషాలు రెచ్చగొట్టి, దాడులకు ఉసిగొల్పుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబునాయుడు, అయ్యన్నపాత్రుడు లాంటి వారికి తగిన బుద్ధి చెప్పడానికి వైసీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోకపోతే, మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. చంద్రబాబును, లోకేష్ ను, అయ్యన్న లాంటి నేల టికెట్ గాళ్లను నోరు అదుపులో పెట్టుకోమని.. ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.