'మా అక్కలు అలా అంటుంటే బాధేస్తోంది'.. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఎమోషనల్‌

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన అక్కలు చేస్తున్న ఆరోపణలు తనను ఎంతో బాధిస్తున్నాయని కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

By అంజి  Published on  8 May 2024 3:17 PM IST
Kadapa MP candidate, YS Avinash Reddy, APPolls, YCP

'మా అక్కలు అలా అంటుంటే బాధేస్తోంది'.. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఎమోషనల్‌

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన అక్కలు చేస్తున్న ఆరోపణలు తనను ఎంతో బాధిస్తున్నాయని కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. వారితో పోరాడే శక్తిని తనకు ప్రజలే ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ షర్మిల, సునీతారెడ్డి ఉయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నిరాధార వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారని అన్నారు. ప్రతీరోజు తనను తిట్టడమే పనిగా పెట్టుకుని ఎల్లో మీడియాకు వత్తాసు పలుకుతున్నారని ఫైర్‌ అయ్యారు.

తన అక్కలు తప్పుడు ఆరోపణలు చేస్తుంటే.. కోపం కంటే ఎక్కువగా బాధేస్తోందని అన్నారు. వాళ్లే తనను టార్గెట్‌ చేస్తున్నారని అవినాష్‌ రెడ్డి ఎమోషనల్‌ అయ్యారు. రెండేళ్లుగా ఎవరూ మాట్లాడలేదని, వాచ్‌మెన్‌ రంగన్నకు నార్కో అనాలసిస్‌ టెస్ట్‌ చేసినా ఏమీ మాట్లాడలేదని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండి ఏ పని కావాలన్నా చేసే వ్యక్తి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి అని, అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టించారని అన్నారు. తన తప్పు లేకపోయినా తన్ను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. వివేకం చిన్నాన్నను చంపిన వాస్తవం వెలుగులోకి వస్తుందన్నారు. చంద్రబాబుతో వైఎస్‌ షర్మిల, సునీతారెడ్డి చేతులు కలిపారని అవినాష్‌ రెడ్డి ఆరోపించారు. మీరు వాళ్ల వారసులా.. లేక వైఎస్సార్‌ వారసులా? అని ప్రశ్నించారు.

Next Story