సినీ నటి జెత్వానీ కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. జెత్వానీ, పోలీసుల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్, విద్యాసాగర్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదలను వినిపించారు. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీ, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు మరోసారి ఊరటను కల్పించింది. వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పొడిగించింది. వచ్చే శుక్రవారం వరకు ఆదేశాలను పొడిగించింది. ఇక వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు రేపు విచారణ జరపనుంది. పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందనే ఆందోళనను వర్మ తన పిటిషన్ లో తెలిపారు.