సీఎం వైఎస్ జగన్‌పై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

JC Diwakar Reddy Sensational Comments On Jagan. టీడీపీ సీనియ‌ర్‌ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

By Medi Samrat
Published on : 23 Feb 2021 12:28 PM IST

JC Diwakar Reddy Sensational Comments On Jagan

అనంతపురం : టీడీపీ సీనియ‌ర్‌ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు అనంతలో మీడియాతో మాట్లాడిన‌ ఆయన.. సీఎం జగన్ ఒక రోజు ఆదాయం రూ. 300 కోట్లు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఇది ఎంతవరకు నిజమో..? అబద్ధమో..? తెలియదు కానీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో ఆయన గెలుపొందుతున్నారని ఆరోపించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని.. అయినా వైసీపీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారన్నారు. అక్కడ అధికార పార్టీ డబ్బుకు తోడు.. పోలీసులు కూడా భయబ్రాంతులకు గురిచేశారన్నారు. అభివృద్ధి చూసి వైసీపీకి ఓటేశారని చెప్పడం అబద్ధమని.. చంద్రబాబు, జగన్ లు ఎలాంటి వారో..? ప్రజలందరికీ బాగా తెలుసని జేసీ వ్యాఖ్యానించారు.




Next Story