నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి గెలవడం కష్టమని తాను ముందే చెప్పానని.. ఆయన ఎందు ఓడిపోయారో అందరికీ తెలుసునని మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శాసన సభా సమావేశాల ప్రారంభం రోజున ఆయన అసెంబ్లీకి వచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆతరువాత సీఎల్పీలోని తన పాత మిత్రులను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
జానారెడ్డి నాకు మంచి మిత్రుడు. ఆయన నాగార్జున సాగర్‌లో గెలవడం కష్టమని ముందే చెప్పా. ఎందుకు ఓడిపోయారో ప్రజలందరి తెలుసు. ఇక హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి తనకు తెలియదన్నారు. రాజకీయాలు ఎక్కడ బాగలేవని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు సమాజం కూడా బాగోలేదన్నారు. తెలంగాణను వదిలి చాలా నష్టపోయామన్నారు. ఏపీని వదలి తెలంగాణకు వచ్చేస్తానని అన్నారు. ఆనాడు జైపాల్‌రెడ్డిని రాయల తెలంగాణ కావాలని అడిగితే ఒప్పుకోలేదని జేసీ చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పాలనలో జేసీ దివాకర్ రెడ్డి కీలక నేతగా రాష్ట్రరాజకీయాల్లో చక్రం తిప్పారు.