మంగళగిరిలోని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జనసేన వీరమహిళలు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. మూడు పెళ్లిళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ జనసేన వీరమహిళలు మహిళా కమిషన్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి వీరమహిళలు ర్యాలీగా వెళ్లారు. మహిళా కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వీరమహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వీరమహిళలను పోలీసులు అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. జనసేన అధినేత పై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు సరికాదన్నారు. వాసిరెడ్డి పద్మ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు
పవన్ కళ్యాణ్ ఏపీ లోని వాలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..! కొందరి కారణంగా డేటా ఇతరుల చేతుల్లోకి వెళుతోందని.. ఇది ఏపీలోని మహిళల అక్రమ రవాణాకు కారణమవుతూ ఉందని అన్నారు. పవన్ వ్యాఖ్యలకు పలువురు వైసీపీ నేతలు కౌంటర్లు వేశారు. వారిలో వాసి రెడ్డి పద్మ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ఆమె కొన్ని కామెంట్లు చేయడం.. జనసేన నేతలకు నచ్చలేదు.