అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన జనసేన చీఫ్‌ పవన్

తాజాగా మరో శాసనసభ స్థానానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థిని ఖరారు చేశారు.

By Srikanth Gundamalla  Published on  4 April 2024 9:15 AM GMT
janasena, pawan kalyan, avanigadda,  candidate,

అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన జనసేన చీఫ్‌ పవన్ 

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న వేళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడిగా పోటీ చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా సీట్ల పంపకాలను కూడా పూర్తిచేసుకున్నాయి. ఆయా పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా మరో శాసనసభ స్థానానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థిని ఖరారు చేశారు.

అవనిగడ్డ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్‌ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ప్రకటించారు. అభ్యర్థి ఎంపికకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో పవన్ చర్చలు జరిపారు. ఆ తర్వాతే బుద్ధ ప్రసాద్‌ ఎంపికను ఖరారు చేశారు. ఈ మేరకు అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా బుద్దప్రసాద్‌ పేరును ప్రకటించారు.

పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి పేరుపై రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని జనసేన నేత హరిప్రసాద్‌ వెల్లడించారు. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై పవన్ కల్యాణ్ పార్టీ నాయకులతో చర్చిస్తున్నారని అన్నారు. అలాగా వారి నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. రైల్వే కోడూరు అభ్యర్థిగా యనమల భాస్కరరావు పేరును పవన్ కల్యాణ్‌ ప్రకటించారని చెప్పారు. ఆయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో.. మిత్రపక్షం టీడీపీ నుంచి సానుకూలత లేదనీ దాంతో అక్కడ అభ్యర్థిని మార్చాలని అనుకుంటున్నట్లు జనసేన నేత హరిప్రసాద్‌ చెప్పారు.

Next Story