పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం ఉంటుందని చెప్పారు పవన్ కళ్యాణ్.
By Srikanth Gundamalla Published on 9 July 2023 7:59 AM GMTపొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయ. ఈ క్రమంలో రాజకీయాలు అప్పుడే వేడెక్కాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పవన్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా.? పొత్తు పెట్టుకుంటారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాట్లాడారు. వారాహి విజయ యాత్ర సాగిన నియోజకవర్గ ఇంచార్జులు, పరిశీలకులతో సమావేశమైన పొత్తుల గురించి వ్యాఖ్యానించారు.
సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం ఉంటుందని చెప్పారు పవన్ కళ్యాణ్. నిస్వార్ధంగా కష్టపడితే అధికారం దానంతటే అదే వస్తుందని అన్నారు. వైసీపీ అరాచక పాలనతో 70 శాతం ప్రజలు విసిగిపోయారని అన్నారు. రాష్ట్రానికి స్థిరత్వం తీసుకురావడమే జనసేన పార్టీ లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా వారాహి యాత్రను విజయవంతంగా సాగేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోరాటం వృథా కాదు.. రానున్న ఎన్నికల్లో జనసేన బలమైన ముద్ర వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వారాహి యాత్రను మీ అందరి కృషితోనే విజయవంతంగా ముగించగలిగామని అన్నారు. రెండో మలి విడత యాత్రను కూడా ఇదే విధంగా సెక్సెస్ చేద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూడాలంటే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా నుంచే వైసీపీ పతనం ప్రారంభం కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక్కడ ప్రారంభమైతే రాష్ట్రమంతటా విస్తరిస్తుందని చెప్పారు. సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం ఉంటుందని చెప్పారు పవన్ కళ్యాణ్.