వెన్నునొప్పితో పవన్ కళ్యాణ్.. అప్పటి నుండి అనుభవిస్తూనే ఉన్నారట
కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం వారాహి విజయ యాత్రలో
By అంజి Published on 3 Oct 2023 4:44 PM ISTపవన్ కళ్యాణ్‌కు తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో జనవాణి అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ జనవాణి కార్యక్రమంలో పలు ఫిర్యాదులు వచ్చాయి. జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడ్డారు. కొంతసేపు రెస్ట్ తీసుకున్నా వెన్ను నొప్పి తగ్గకపోవడంతో వెంటనే ఆయన కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో పవన్ కళ్యాణ్ వెన్నుపూసకు గాయాలు అయ్యాయి. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పితో బాధపడుతూ ఉన్నారు.
జనసేన చేపట్టిన వారాహి విజయ యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని.. అల్లరి మూకలతో గొడవలు సృష్టించి భయబ్రాంతులకు గురి చేయాలని, కేసులతో ఇబ్బందులు పెట్టాలని ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం ఉందని జనసేన ఒక ప్రకటనను విడుదల చేసింది. బుధవారం జరగబోయే పెడన నియోజకవర్గ వారాహి విజయయాత్ర సభలో రౌడీ మూకలు, గూండాలు, అల్లరి మూకలను దించి సభపై రాళ్ల దాడి చేయించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. సభలో ఎలాంటి అలజడులు సృష్టించినా దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని జనసేన అధ్యకులు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
Next Story