ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాగా ప్రకటించండి : ప‌వ‌న్ క‌ల్యాణ్

Janasena Chief Pawan Kalayan Satirical tweet on YCP.వైసీపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ మ‌రోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Oct 2022 12:52 PM IST
ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాగా ప్రకటించండి : ప‌వ‌న్ క‌ల్యాణ్

వైసీపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి త‌న‌దైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "గ‌ర్జ‌న" దేనికి అంటూ రాష్ట్ర ప్ర‌భుత్వ తీరును వ‌రుస ట్వీట్ల‌తో సోమ‌వారం ఎండ‌గ‌ట్టిన ప‌వ‌న్‌.. మంగ‌ళ‌వారం కూడా విమ‌ర్శ‌లు చేశారు. మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను విమ‌ర్శిస్తూ తీవ్రంగా మండిప‌డ్డారు.

మూడు రాజ‌ధానులు కాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర‌గా ప్ర‌క‌టించాల‌ని ప‌వ‌న్ ఎద్దేవా చేశారు. రాజధాని వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి జరుగుతుందని వైసీపీ ప్రభుత్వం బావిస్తుంటే కేవలం మూడు రాజ‌ధానులే ఎందుకు ..? 25 జిల్లాల‌ను రాష్ట్రాలుగా ప్ర‌క‌టించి 25 రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. రాజ్యాంగం, చట్టం, న్యాయ వ్యవస్థ కంటే తామే గొప్ప అని వైసీపీ భావిస్తోందని, రాష్ట్ర ప్రజల మనోభావాలను లెక్క‌చేయ‌డం లేద‌న్నారు.

విశాఖ జిల్లాలోని రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ 'మౌంట్ దిల్ మాంగే మోర్' ధన-వర్గ-కులస్వామ్యానికి చిహ్నమని.. బూతులకు కూడా అని ట్వీట్ చేశారు. అమెరికాలోని సౌత్ డకోటాలో ఉన్న మౌంట్ రష్ మోర్ ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ-విశ్వాసాలకు ఇది నిదర్శనమని చెప్పుకొచ్చారు.

Next Story